Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: క్యూబాలోని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం నుంచి నిరసనలు జరుగుతున్నాయి. వాటికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ మద్దతు ప్రకటించారు. అయితే, రష్యా, మెక్సికో దేశాలు మాత్రం క్యూబా అంతర్గత విషయాల్లో ఏ దేశమూ జోక్యం చేసుకోరాదని హెచ్చరించాయి. మెక్సికో అధ్యక్షుడు క్యూబాకు కావాల్సిన అత్యవసర మందులను పంపడానికి తన సంసిద్ధతను ప్రకటించారు. క్యూబాలో ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బయటి శక్తులు పనిచేస్తున్నాయనీ, ఎవరా బయటి శక్తులు అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.అమెరికా 60 సంవత్సరాల నుంచి క్యూబాపై ఆంక్షలు విధించింది.