Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండ్: నేపాల్ రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ ఆ దేశ సుప్రీంకోర్టు ప్రతిపక్ష నాయకుడు షేర్ బహదూర్ దువ్బాను ప్రధానిగా నియమించండని ఆదేశించింది. దేవ్బా నేపాల్ కాంగ్రెస్ నాయకుడు. గత మే నేలలో అప్పటి తాత్కాలిక ప్రధాని ఓలీ రెండో సారి పార్లమెంటును రద్దు చేయమని సిఫారసు చేయడం, అధ్యక్షురాలు పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు ప్రకటించి ఓలీని తాత్కాలిక ప్రధానిగా నియమించడం తెలిసిందే.ఈ విషయంలో నేపాలు సుప్రీంకోర్టు కలుగజేసుకుని పార్లమెంటును పునర్వ్యవస్థీకరించండనీ, దేవ్బాను ప్రధానిగా నియమించాలని ఆదేశించింది. దీంతో ఎన్నికలకు పోవాలనే ఓలీ ప్రయత్నానికి బ్రేక్ పడింది. దేవ్బా తనకు 149 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు ఉందని అధ్యక్షురాలిని కలిసి లేక ఇవ్వడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే, ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీంకోర్టు ప్రధానిని నియమించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.