Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రస్సెల్స్: పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడంలో బాగంగా యూరోపియన్ యూనియన్ కొన్ని కొత్త చట్టాలను రూపొందిస్తున్నది. అందులో బాగంగా తమ దేశంలో పని చేస్తున్న విదేశీ కంపెనీలపై పన్నులు వేయాలని ప్రతిపాదించి గ్యాస్, డీజిల్‌తో నడిచే వాహనాలను క్రమ పద్ధతిలో 2035లోపు తొలగించనున్నారు. ఇళ్ళను వెచ్చగా ఉంచుకునేందుకు వాడే పరికరాలపై పన్నులు పెంచాలని భావిస్తున్నారు. ఓడలు, విమానాలు వాడే ఇందనంపై మొదటి సారి పన్నులు విధించనున్నారు. కంపెనీలు తాము విడుదల చేసే కార్బన్ ఉద్ఘారాకాలకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాంటి చర్యల ద్వారా రానున్న 10 సంవత్సరాలలో 55 శాతం కార్బన్ ఉద్ఘారాకాలను తగ్గించాలనే లక్ష్యం పెట్టుకున్నది. గతంలో పెట్టుకున్న లక్ష్యాలు 2030 నాటికి 40 శాతం తగ్గించాలని ఉండేది. దానిలో తీవ్రమైన మార్పులు చేయనున్నారు. ఈ ప్రతిపాదనలను యూరోపియన్ యూనియన్ 27 సభ్య దేశాలు ఆమోదించాల్సి ఉన్నది.