Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్పుల విరమణకు సిద్ధం. తాలిబన్లు
కాబూల్: తాలిబన్లు మూడు నెలలు కాల్పుల విరమణకు సిద్ధం అని అయితే వారికి సంబంధించిన ఏడువేల మంది ఖైదీలను అప్ఘాన్ ప్రభుత్వం విడుదల చేయాలని షరతు విధించి, దానితో పాటు తాలిబన్ నాయకుల పేర్లను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించాలని కూడా కోరుతున్నారు.అమెరికా సైన్యాల ఉపసంహరణ ప్రారంభం అయినప్పటి నుంచి తాలిబన్లు అప్ఘనిస్థాన్‌లోని దాదాపు 200 జిల్లాలను , ప్రధాన నగరాలు, విమానాశ్రయాలను, పాకిస్థాన్‌లో ఉన్న సరిహద్ద మార్గాలను చాలా వరకు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల వద్ద రోజు రోజుకు ఘర్షణలు పెరుగుతున్నాయి. రాళ్ళు రువ్వడం, పాకిస్థాన్‌లోకి బలవంతంగా చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడం జరుగుతున్నది. దానిలో పాకిస్థాన్ వైపు నుంచి బాష్ఫవాయు ప్రయోగించడం సరిహద్ధులను మూసివేయడం జరిగింది.