Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతం నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న సరుకులను నిషేధించడానికి సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. జిన్జియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది. ఉగ్యూర్ ముస్లిం పట్ల వివక్షత పాటిస్తున్నారనీ, వారిని కార్మికులుగా నియమించుకుని తీవ్రంగా దోచుకోవడం జరుగుతున్నదని అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తున్నది. ఆ ప్రాంతంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం ఒత్తిడి పెంచేందుకు సరుకుల నిషేదం అనే విధానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్భంలో ఒక సెనేట్ సభ్యుడు మాట్లాడుతూ ఇక చాలు ఆపండి 'ఇప్పటి వరకు జరిగిన దోపిడి అంతం కావాల్సిందే మేము చైనా కమ్యూనిస్టు పార్టీకి, ఆ ప్రాంతంలో పరిశ్రమల యజమానులకు సూటిగా అర్థం అయ్యేలా చెప్పుతున్నాము'. అని అన్నారు. ఇప్పటికే చైనాలోని ఒక పరిశ్రమలో ఉత్పత్తి అవుతున్న సోలార్ ఫ్యానల్స్ను అమెరికా నిషేధించింది. మరో నాలుగు కంపెనీలపై కూడా నిషేధం విధించే అవకాశం ఉన్నది.