Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహింగ్యాలపై ఫొటో ఫీచర్‌కు పులిట్జర్ పురస్కారం
కాబూల్ : ఆఫ్ఘనిస్తా న్లో ఆ దేశ బలగాలు, తాలిబాన్లకు మధ్య జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిశ్ సిద్దిఖీ ప్రాణాలు కోల్పోయా డు. కాందహార్‌లోని స్పిన్ బొల్డాక్ ప్రాంతంలో గల కీలక ప్రాంతాన్ని తాలిబాన్లు ఇటీవల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాంతో గత కొద్దిరోజులుగా తాలిబాన్,ఆఫ్ఘాన్ బలగాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి.రాయిటర్స్ సంస్థలో పనిచేస్తున్న డానిశ్..ఈ ఘటన లను కవర్ చేస్తున్నాడు. అయితే గురువారం రాత్రి తాలిబాన్లు జరిపిన బాంబు దాడుల్లో ఆయన మృతిచెందాడని ఆఫ్ఘన్ సైనిక బలగాల ఉన్నతా ధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.డానిశ్ మృతిని భారత్‌కు చెందిన ఆఫ్ఘాన్ రాయబారి ఫారిద్ మముంజే ట్విటర్ వేదికగా ధ్రువీ కరించి సంతాపం ప్రకటించారు. ''డానిశ్ సిద్దిఖీ మరణం బాధాకరం. రెండు వారాల క్రితమే ఆయనను కలిశా. ఆఫ్ఘాన్ బలగాలతో కలిసి ఆయన ఘర్షణ జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సాను భూతి తెలియజేస్తున్నా''నని ఫారిద్ ట్వీట్ చేశారు. ముంబ యికి చెందిన డానిశ్..మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. తొలుత టీవీ న్యూస్ కరస్పాండెంట్‌గా పనిచేసిన ఆయన, 2010లో ఫొటో జర్నలిస్టుగా రాయిటర్స్‌లో చేరారు. 2018లో రోహింగ్యా శరణా ర్ధులపై చేసిన ఫీచర్ ఫొటోగ్రఫీకిగానూ ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు అందుకున్నా రు.ఆసియా, పశ్చిమాసియా, యూరప్‌లలో అనేక చోట్ల తలెత్తిన సంక్షోభాల్ని, యుద్ధాల్ని అత్యంత సాహసోపేతంగా డానిశ్ సిద్దిఖీ కవర్ చేశారు.ప్రస్తుతం ఆయన రాయిటర్స్ ఇండియా చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఉన్నారు. సిద్దిఖీ ఆకస్మిక మరణంపై పలువురు జర్నలిస్టులు, ఇతర మీడి యా మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో యుద్ధాలు, రోహింగ్యా శరణార్తుల సంక్షోభం, నేపాల్ భూకంపాలు, హాంకాంగ్ నిరసనలు మొదలైనవి ఆయన కవర్ చేశారు.శ్రీలంక పేలుళ్ల సమయంలో పోలీసు కేసును కూడా సిద్దిఖీ ఎదుర్కొన్నారు.