Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిబియా నిర్బంధ శిబిరాల్లోని మహిళల దుస్థితి..
ట్రిపోలి : లిబియా నిర్బంధ శిబిరాల్లోని వలసదారుల పరిస్థితి భయానకంగా ఉందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం తెలిపింది. తాగడానికి మంచినీటి కోసం కూడా కాపలాదారులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిపింది. ఆహారం, పారిశుధ్యం ఇలా వలసదారులు కనీస అవసరాలకు కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. మీకు మంచినీరు కావాలన్నా, ఇక్కడి నుండి విడిపించాలన్నా.. మీరు ... అంగీకరించాల్సిందేనంటూ అక్కడి కాపలాదారులు వేధిస్తున్నారని పలువురు మహిళలు ఆమ్నెస్టీకి తెలిపారు. లేకుంటే అత్యాచారం చేస్తున్నారని వెల్లడించారు. చివరికి గర్భిణులను సైతం వేధిస్తున్నారని అన్నారు. నైజీరియా, సోమాలియా, సిరియాల నుంచి లిబియా చేరుకున్న 14 నుండి 50 ఏండ్ల వయస్సు మథ్య గల మహిళల నుంచి ఈ సమాచారాన్ని సేకరించినట్టు ఆమ్నెస్టీ తెలిపింది. అక్కడి నుంచి పారిపోయిన వారితో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపింది. వారిని కొట్టడం, హింసించడం, ఆహారం అందించకపోవడం వంటి ఘటనలు 2017 నుండి ఇక్కడ జరుగుతున్నట్టు తెలిపింది. మధ్యదరా సముద్రం నుంచి అక్రమంగా లిబియాలోకి ప్రవేశించిన వలసదారులను ప్రభుత్వం అడ్డుకుని నిర్బంధ శిబిరాలకు తరలిస్తోంది. ఈ ఏడాది అక్కడి శిబిరాల్లోని మహిళలు.. వారు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అధ్యయనం చేపట్టినట్టు ఆమ్నెస్టీ తెలిపింది. వలసదారులకు లిబి యా సురక్షితమైన దేశం కాదని యూరోపియన్ యూని యన్ సభ్యులు పేర్కొంటున్నారు. యూరోపియన్ యూనియన్ కమిషన్, ఎగ్జిక్యూటివ్స్ లిబియా కోస్ట్గార్డులకు నిధులు ఇవ్వడం నిలిపివేయాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ శిబిరాలను లిబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తమ నియంత్రణలోకి తీసుకుంది.
అయితే ఇటీవల ఇక్కడి పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని అమ్నెస్టీ సంస్థ తన నివేదికలో పేర్కొంది. కాగా, ఈ శిబిరాలను మూసివేయాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.