Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: తాలిబన్లు బలవంతంగా అధికారం హస్తగతం చేసుకుంటే గుర్తించేది లేదని అఫ్ఘనిస్థాన్‌కు సంబంధించిన అమెరికా ప్రత్యేక ప్రతినిధి జలమే కలీలాజాద్ అన్నారు. అమెరికా తాలిబన్ల మధ్య అనేక దఫాలుగా జరిగిన చర్చల అనంతరం సైనిక ఉపసంహరణకు సంబందించిన ఒప్పందం కుదిరిన విషయం విదితమే. సెప్టెంబర్‌లోపు సైనిక ఉపసంహరణ జరగాల్సి ఉండగా, ఎక్కువ భాగం అమెరికా బలగాలు నిష్క్రమించాయి. ఒక వైపు అమెరికా నాటో సైన్యాల ఉపసంహరణ జరుగుతుంటే రెండో వైపున తాలిబన్లు అఫ్ఘనిస్థాన్‌లోని 80 శాతం ప్రాంతాన్ని ఇప్పటికే తమ ఆధీనంలోకి బలవంతంగా తీసుకున్నారు. అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం, దాని సైన్యం తీవ్ర ప్రతిఘటననుఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పదివేల మంది ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి అఫ్ఘనిస్థాన్లోకి ప్రవేశించినట్టు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అఫ్ఘాన్ అధ్యక్షుడు పాకిస్థాన్‌కు తెలిపారు. మరో వైపు అఫ్ఘాన్‌లో ఎవరు అధికారంలోకి వచ్చిన వారితో తాము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రకటించింది.అఫ్ఘనిస్థాన్ సమస్యకు సైనిక పరిష్కారం ఉండదని చర్చల ద్వారా ఆ దేశ ప్రజల అభిమతం ప్రకారం పరిష్కారం జరగాలని జలమే కలీలాజాద్ చెప్పుకొచ్చారు. అప్పుడు పొరుగుదేశాలు, సహాయ సంస్థలు, అఫ్ఘాన్‌లో అభివృద్ధికి సహకరిస్థాయని అన్నారు. ఎవరు పరిపాలించాలి, ఎలా పరిపాలించాలి అనేది అప్ఘాన్ ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. అమెరికా అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని బలపరుస్తుందని 3.3. బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అక్కడ రక్షణ శాఖకు కేటాయించామని, మనుషుల పట్ల కనికరంతో కూడా సహకరిస్తామని అన్నారు