Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: యూరప్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటివరకు 126 మంది చనిపోయగా, వరదల్లో వందలాది మంది గల్లంతయ్యారు. వారికోసం అన్వేషణ కొనసాగుతున్నది. ఈ మధ్య కాలంలో ఇంత తీవ్రస్థాయిలో వరదలు చూడలేదని జర్మనీ ప్రజలు చెబుతున్నారు. 15 నిమిషాలలో అన్నీ నీటిలో కొట్టుకుపోయాయనిప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు.రహదారులు, ఇండ్లు, నీట మునిగాయి. కార్లు కొట్టుకుపోయాయి. జర్మనీలోని కొన్ని జిల్లాలతో సంబంధాలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉత్తర జర్మనీలో కొండ చరియలు విరిగిపడటంతో.. కొంత మంది భయానికి చనిపోయినట్టు తెలుస్తున్నది. స్విట్జర్లాండ,్ బెల్జియం, లక్సంబర్గ్, నెదర్ల్యాండ్లలో వరద బీభత్సం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది పశ్చిమ యూరప్ ప్రాంతంలో సాధారణ స్థితిలో రెండు నెలలో కురవాల్సిన వానలు కేవలం రెండు రోజుల్లో కురిసినట్టు ప్రపంచ వాతావరణ శాఖ తెలిపింది.