Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో: శ్రీలంకకు చైనా 27 లక్షల సినోఫామ్ వ్యాక్సిన్లు ఉచితంగా పంపుతున్నది. శ్రీలంకలో ఇప్పటికి 8 శాతం మంది పెద్దలకు వ్యాక్సిన్లు ఇచ్చారు. దీనికి అదనంగా ఇప్పటికే చైనా నుంచి 60 లక్షల వ్యాక్సిన్లను శ్రీలంక కొనుగోలు చేసింది. ఈ నెలాఖరుకు కోటి చైనా సినోఫామ్ వ్యాక్సిన్లు చేరుతాయి. శ్రీలంకలో ఇప్పటికే థర్డ్‌వేవ్ ప్రారంభమైంది.గురువారం 1484 కొత్త కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటికే 16 లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారు. అందులో 70 శాతం మంది సినోఫామ్ తీసుకున్నారు. శ్రీలంకలో జనవరి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. కోవీషీల్డ్, సినోఫామ్ స్పూత్నిక్, ఫేజర్ వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. ఎక్కువ శాతం మంది సినోఫామ్ వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. జపాన్, అమెరికా కూడా శ్రీలంకకు వ్యాక్సిన్లు పంపుతున్నాయి.