Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో అధికారిక ప్రకటన
లిమా : వామపక్షవాది పెడ్రో కేసిల్లోను పెరూ కొత్త అధ్యక్షునిగా అధికారికంగా ప్రకటించనున్నారు. మితవాద పార్టీ పాపులర్ ఫోర్స్ (ఎఫ్‌పి) అభ్యర్థి కెయికో ఫ్యుజిమొరి, ఎన్నికలపై చేసిన ఫిర్యాదులన్నింటినీ తిరస్కరించిన అనంతరం నేషనల్ జ్యూరీ ఆఫ్ ఎలక్షన్స్ (జెఎన్ఇ) కొత్త అధ్యక్షుడిని ప్రకటించడానికి రంగం సిద్ధం చేసింది. అయితే అధికారిక ప్రకటన మంగళ, బుధవారాల్లో రావచ్చని జెఎన్ఇ సలహాదారు అలెగ్జాండ్రా మారాల్లననో తెలిపారు. ఈ ఎన్నికల్లో ఫ్యుజిమొరి కన్నా కేసిల్లోకి 44,058ఓట్లు ఎక్కువగా వచ్చాయి. 60మంది ప్రత్యేక ఎలక్టోరల్ జ్యూరీల సమీక్ష అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు జెఎన్ఇ తెలిపింది. జూన్ 6న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కేసిల్‌లో ఆధిక్యతను దక్కించుకున్నారు. కానీ మితవాద అభ్యర్ధి సవాలు చేయడం వల్ల అధికారిక ప్రకటన ఆలస్యమైంది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్రను పెంచే, ప్రభుత్వ సర్వీసులను మెరుగుపరిచే సంస్కరణల ప్రణాళికను చేపట్టేందుకు కొత్త రాజ్యాంగాన్ని కేసిల్‌లో ఆమోదించాలని భావిస్తున్నారు.