Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానాకు సమీపంలోని లా గినెరా ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం హింస, విధ్వంసం చోటు చేసుకుంది. క్యూబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలోనే ఆదివారం, విప్లవానికి మద్దతుగా, అధ్యక్షుడు డియాజ్ కానెల్కు, కమ్యూనిస్టు పార్టీకి సంఘీభావంగా ప్రదర్శన జరిగింది. క్యూబన్ యోధుడు, విప్లవ రక్షణ కమిటీ జాతీయ సమన్వయకర్త గెరాడో హెర్నాండెజ్ నొర్డెలొ, క్యూబా కమ్యూనిస్టు పార్టీ ఫస్ట్ కార్యదర్శి లూయిస్ అంటానియో టొరెస్ ఇరిబర్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. లా గినెరాలో కష్టించి పనిచేసే, విప్లవ కార్యకర్తంలందరూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన భావోద్వేగంతో కూడిన సమావేశంలో గెరాడొ, ఇరిబర్లు ప్రసంగించారు.