Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 45 ఏండ్లలో అత్యధిక ఉష్ణోగ్రత
- వేడిని తట్టుకోలేక భారీగా బీచ్లవైపు
- ఒక్కరోజే 54 వేల కరోనా కేసులు
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే)ఇప్పుడు నిప్పుల కొలిమిలా మండుతున్నది.ఎండతీవ్రతను తట్టుకోలేక భారీగా బీచ్లవైపు దౌడు తీస్తున్నారు. కరోనా ఆంక్షలు తొలగించాక..మాస్క్‌ల్లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నారు. దీంతో ఒక్కరోజే 54 వేల కోవిడ్ కేసులు నమోదవ్వటంపై అధికారుల్లో ఆందోళనవ్యక్తమవుతున్నది. యూకేలో సగటున 12 నుంచి 14 డిగ్రీల వరకు ఉష్ణో గ్రతలు జులైనెలలో నమోదవుతుంటాయి. కానీ ఈసారి 32 డిగ్రీలకు చేరుకున్నది. గత 45 ఏండ్లలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. బ్రిటన్‌లో శనివారం హాటెస్ట్ డే అని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఊహించనివిధంగా వేడి పెరుగుతున్నది. ఆ ఎండలకు తట్టుకోలేక.. లక్షలాది మంది సముద్ర తీరాలకు తరలివస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని బౌర్న్మౌత్ బీచ్‌కు భారీగా చేరుకుంటున్నారు. బౌర్న్మౌత్ టౌన్లో రద్దీ..బీచ్‌పై కరోనా పంజా
బౌర్న్మౌత్ బీచ్ పొడువుగా ఉండటమే కాదు.ప్రపంచంలోనే పర్యాటక ప్రాంతాల్లో ఈ బీచ్‌కు ప్రత్యేక ఉన్నది. ఏటా 70 లక్షల మంది సందర్శించడానికి ఇక్కడకు వస్తారని గైడ్స్ అంటున్నారు. వాతావరణ శాఖ ప్రకారం 1976 లో 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ఏడాది మేనెలలో ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు చేరుకున్నది, అపుడు అత్యధిక వేడి రోజుగా భావించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఈ ఎండల బాధ పడలేక..బీచ్‌లకు వెళ్తున్నారు. శనివారం నాడు అత్యధికంగా 54 వేల కోవిడ్ కేసులు వచ్చినట్టు రిపోర్టులు ధ్రువీకరిస్తున్నాయి. ఇదిలా ఉంటే
సోమవారం నుంచి బ్రిటన్ పూర్తి అన్‌లాక్ అమల్లోకి వచ్చింది. ఇంట్లో ఉండటం కన్నా..బీచ్‌లకు వెళ్దామంటూ ఫ్యామీలీలకు ఫ్యామీలీలు బయలుదేరుతున్నాయి. యూకే లో అన్‌లాక్‌తో కరోనా విజృంభించేఅవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఆ దేశంతో పాటు ప్రపంచానికి ముప్పుగా మారను న్నదని 1200 మంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.