Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిమా: లాటిన్ అమెరికా దేశం పెరూ అధ్యక్షుడిగా వామపక్ష నేత పెడ్రో క్యాస్టిలో ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు జరిగి.. ఓట్ల లెక్కింపు ఆరువారాల క్రితమే పూర్తయినా వామపక్షవాది గెలవడంతో ఎన్నికల ఫలితాల ప్రకటనను వాయిదా వేస్తూ వచ్చారు. క్యాస్టిలోకు 50.2శాతం ఓట్లు వచ్చాయి. రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థికంటే 44.000 ఓట్లు అధికంగా వచ్చాయి. అన్నీ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఎన్నికలలో అవకతవకలు జరగలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. క్యాస్టిలో గ్రామీణ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగారు. ఎన్నికల ఫలితాలు ప్రకటన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంకిత భావంతో పనిచేస్తానని ప్రకటించారు.