Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూబాకు సంఘీభావ వెల్లువ
- అమెరికా వ్యాప్తంగా విరాళాల సేకరణ
- 60 లక్షల సిరంజ్‌లు పంపిన సంఘీభావ గ్రూపులు
వాషింగ్టన్ : క్యూబాపై అమెరికా ఆర్థికరమైన, ఇతర దిగ్బంధనాలకు వ్యతిరేకంగా అమెరికాలోని సంఘీభావ గ్రూపులు మద్దతుగా నిలిచాయి. అమెరికాలోని క్యూబన్లతో పాటు రెండు దేశాల ప్రజల మధ్య ఐక్యతను కోరుకునే వారి నుంచి అన్ని రాష్ట్రాల్లో విరాళాలు సేకరించామని, వాటి ద్వారా దాదాపు 60 లక్షలకు పైగా సిరంజ్‌లు కొనుగోలు చేసి క్యూబాకు పంపినట్లు క్యూబా సంఘీభావ ఉద్యమం పేర్కొంది. బుధవారం నాడు వాషింగ్టన్‌లోని క్యూబా రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్యమానికి చెందిన సభ్యులు మాట్లాడుతూ క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం సమయంలో క్యూబాకు సంఘీభావం తెలిపాలని పిలుపునిచ్చారు. క్యూబాకు సంఘీభావంగా విరాళాలు సేకరించేందుకు తాము పెద్దయెత్తున ప్రచారం నిర్వహించామని తెలిపారు. ఇందులో భాగంగా క్యూబాలోని మారియెల్ పోర్టుకు 20 లక్షల మేర సిరంజ్‌లు ఈనెల 17న చేరాయని వెల్లడించారు. అమెరికాలోని అన్ని ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 5 లక్షల డాలర్లకు పైగా విరాళాలు అందాయి. గత 27 ఏళ్లుగా క్యూబాకు మెడిసిన్స్, వైద్య పరికరాలు పంపిస్తున్న గ్లోబల్ హెల్త్ పార్ట్నర్స్ అనే మానవతా సంస్థ ఈ సిరంజ్ల కొనుగోలు, షిమ్మెంట్ ప్రక్రియను నిర్వహించింది.
సిరంజ్ల కోసమే కాకుండా క్యూబాకు ఇతర అవసరాల కోసం కూడా విరాళాల సేకరణ కొనసాగిస్తామని గ్రూప్ సభ్యుడు మెదియా బెంజిమన్ తెలిపారు. అన్నిరకాల మెడిసిన్స్, వైద్య పరికరాలు కూడా పంపిస్తామన్నారు. విరాళాల సేకరణ సందర్భంగా క్యూబన్-అమెరికన్ల నుంచి పెద్దయెత్తున మద్దతు లభిస్తోందని అన్నారు. కరోనా సంక్షోభ సమమంలో క్యూబా అనేక దేశాలకు వైద్యులను పంపి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. క్యూబన్ వైద్యుల సేవలను ప్రశంసిస్తూ ప్రజలు విరాళాలు అందజేస్తున్నారని, పరిమిత వనరులతో చేస్తున్న ప్రచారానికి గట్టి మద్దతు వస్తోందని పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నామని, అదేవిధంగా క్యూబా వెలుపలి దేశాల్లో నివసిస్తున్న క్యూబన్లు అందరూ దేశానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని అమెరికాలో నివసిస్తున్న క్యూబన్ ఫెలిక్స్ కబల్లోరో అన్నారు. విరాళాల సేకరణలో సేవింగ్ లైవ్స్, కొడెపింక్, ది పీపుల్స్ ఫోరం, ఇంటర్నేషనల్ లాంగ్‌షోర్ అండ్ వేర్‌హౌస్ యూనియన్, డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా, క్యూబన్, అమెరికన్లతో కూడిన ది నో ఎంబార్గో క్యూబా మూవ్మెంట్, ప్యూంటెస్ డి అమోర్ పాల్గొన్నాయి. న