Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వచ్చే వారం భారత్‌కు రానున్నారు. ఆసియాలో అమెరికాకు కీలక మిత్రపక్షమైన భారత్‌లో అమెరికా ఉన్నతాధికారి జరపనున్న మొదటి పర్యటన ఇది. ఈ నెల 26-29 తేదీల్లో జరగనున్న బ్లింకెన్ పర్యటనలో కువైట్‌ను కూడా సందర్శించనున్నారు. చైనాను ఎదుర్కొనడానికి భారత్‌ను ముఖ్యమైన భాగస్వామిగా అమెరికా పరిగణిస్తోంది. బ్లింకెన్ పర్యటన తర్వాత డిప్యూటీ విదేశాంగ మంత్రి వెండీ షేర్మన్ చైనాలో పర్యటించనున్నారు.