Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేపుల్స్ : వాతావరణ లక్ష్యాలపై ఒప్పందానికి రావడంలో జి-20 దేశాలు విఫలమయ్యాయని ఇటలీ పర్యావరణ మంత్రి రాబర్ట్ సింగొలని శుక్రవారం తెలిపారు. తమ తుది ప్రకటనలో కీలకమైన వాతావరణ మార్పుల పట్ల నిబద్ధత గురించి ఉపయోగించాల్సిన పదజాలంపై జి-20 దేశాల పర్యావరణ, ఇంధన శాఖ మంత్రులు ఒక అంగీకారానికి రావడంలో విఫలమయ్యారని చెప్పారు. నవంబరులో గ్లాస్కోలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన జరగనున్న వాతావరణ చర్చలకు ముందుగా జి-20 సమావేశం జరిగింది. తుది ప్రకటనలో ఉపయోగించాల్సిన భాషపై అంగీకారానికి రాలేకపోవడంతో స్కాట్లాండ్లో అర్థవంతమైన ఒప్పందం కుదురుతున్న ఆశలపై నీళ్లు జల్లినట్లైంది. రెండు వివాదాస్పదమైన అంశాలపై ఈ సమావేశంలో మంత్రులు అంగీకారానికి రాలేకపోయారని, అక్టోబరులో రోమ్‌లో జరగనున్న శిఖరాగ్ర సమావేశంలో జి-20దేశాల అధినేతలు వాటిని చర్చిస్తారని ఇటలీ మంత్రి చెప్పారు. చైనా, రష్యా, భారత్‌లతో చర్చలు చాలా క్లిష్టంగా జరిగాయని తెలిపారు. బొగ్గు ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమనేది 2025కల్లా నిలిపివేయాలని చాలా దేశాలు భావిస్తున్నాయి. అది తమకు సాధ్యం కాదని కొన్ని దేశాలు చెబుతున్నాయని, ఇదొక వివాదాస్పద అంశంగా మారిందన్నారు.