Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా వ్యాప్తంగా విరాళాల సేకరణ
వాషింగ్టన్ : క్యూబాపై అమెరికా ఆర్థికరమైన, ఇతర దిగ్బంధనాలకు వ్యతిరేకంగా అమెరికాలోని సంఘీభావ గ్రూపులు మద్దతుగా నిలిచాయి. అమెరికాలోని క్యూబన్లతో పాటు రెండు దేశాల ప్రజల మధ్య ఐక్యతను కోరుకునే వారి నుంచి అన్ని రాష్ట్రాల్లో విరాళాలు సేకరించామని, వాటి ద్వారా దాదాపు 60 లక్షలకు పైగా సిరంజ్‌లు కొనుగోలు చేసి క్యూబాకు పంపినట్టు క్యూబా సంఘీభావ ఉద్యమం పేర్కొంది. బుధవారం నాడు వాషింగ్టన్‌లోని క్యూబా రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్యమానికి చెందిన సభ్యులు మాట్లాడుతూ క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రస్తుత సమయంలో క్యూబాకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా క్యూబాలోని మారియెల్ పోర్టుకు 20 లక్షల మేర సిరంజ్‌లు ఈనెల 17న చేరాయని వెల్లడించారు. అమెరికాలోని అన్ని ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 5 లక్షల డాలర్లకు పైగా విరాళాలు అందాయి. సిరంజ్ల కోసమే కాకుండా క్యూబాకు ఇతర అవసరాల కోసం కూడా విరాళాల సేకరణ కొనసాగిస్తామని గ్రూప్ సభ్యుడు మెదియా బెంజిమన్ తెలిపారు. కరోనా సంక్షోభ సమమంలో క్యూబా అనేక దేశాలకు వైద్యులను పంపి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.