Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: వ్యాక్సిన్ తీసుకోని వారు గ్రీన్ పాస్ ఉంటేనే ఆగస్టు 6 తర్వాత బహిరంగ ప్రదేశాల్లో తిరగవచ్చని పెట్టిన నిబంధనలను వ్యతిరేకిస్తూ ఇటలీ వ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ నిరసనలు జరుగుతున్నాయి. గ్రీన్ పాస్ ఉంటేనే సినిమా హాల్స్, మ్యూజియంలు, క్రీడా మైదానాలు,స్విమ్మింగ్ పూల్స్, హౌటల్స్లోకి ప్రవేశం కల్పిస్తామని ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌లోని డిజిటల్ కోవిడ్-19 సర్టిఫికేట్ లాంటిదే ఇది కూడా. ఫ్రాన్స్‌లో హౌటల్స్‌లో ప్రవేశానికి ప్రత్యేక హెల్త్‌పాస్ ఉండాలనే నిబంధనలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలకు పూనుకున్నారు. కోవిడ్-19 నివారణకు పనిచేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలనే నిబంధనకు కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఫ్రాన్స్‌లో మెజారిటీ ప్రజలు ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్నారు. ఒకవైపు నిరసనలు జరుగుతున్నా ఎక్కువ మంది ప్రజలు కొత్త నిబంధనలను బలపరుస్తున్నట్టు తెలుస్తున్నది.