Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ: ఆస్ట్రేలియాలో నెల రోజుల పాటు కఠినమైన లాక్డౌన్ అమలు చేసిన ప్రభుత్వం.. దానిని అక్టోబర్ వరకు కొనసాగిస్తామని ప్రతిపాదించడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలకు పూనుకున్నారు. సిడ్నీ, మెల్బోర్న్లలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. నీళ్ల బాటిల్స్ లాంటివి పోలీసులపైకి విసురుతూ తమ నిరసనను తెలిపారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి నిరసనకారులను అదుపుచేశారు. వందలాది మందికి సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసనల్లో ఎవరూ మాస్కులు ధరించలేదు. కాగా, ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. ఈ నిరసనలు స్వేచ్ఛ కోసం జరుగుతున్నాయని ప్రకటించారు. కోవిడ్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. సిడ్నీలో జరిగిన నిరసనల్లో 57 మందిని, మెల్బోర్న్లో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, దాదాపు 100 మందికి ఫైన్ విధించారు.