Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 57మంది జల సమాధి ?
ట్రిపోలి : ఆఫ్రికన్ శరణార్ధులను తీసుకెళుతున్న బోటు లిబియా తీరంలో సోమవారం బోల్తా పడిన ఘటనలో 57మంది మరణించినట్టు భావిస్తున్నారని ఐక్యరాజ్య సమితి శరణార్ధుల వ్యవవహారాల అధికారి తెలిపారు. యూరప్‌లో మరింత మెరుగైన జీవితం కోసం వలస వెళుతున్న శరణార్ధులకు సంబంధించి మధ్యధరా సముద్రంలో జరిగిన తాజా ఘటన ఇది. ఆదివారం పశ్చిమ తీర ప్రాంత పట్టణమైన కుమ్స్లో బోటు బయలుదేరిందని సాఫా షెలి తెలిపారు.. బోటులో 75మంది శరణార్ధులు వున్నారని ఆమె చెప్పారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా వున్నారు. చనిపోయి ఉండొచ్చని భావిస్తున్న 57మందిలో 20మంది మహిళలు, ఇద్దరు పిల్లలు వున్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లిబియా తీర ప్రాంత రక్షణ దళానికి చెందిన మత్స్యకారులు 18మందిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. వీరిలో నైజీరియా, ఘనా, గాంబియాలకు చెందిన వారు వున్నారు. ఇంజనులో సమస్య తలెత్తడంతో బోటు ఆగిపోయిందనీ, వాతావరణం బాగుండకపోవడంతో తిరగబడి మునిగిందని షెలి తెలిపారు. గత బుధవారం కూడా ఇదే తరహాలో శరణార్ధులను తీసుకెళుతున్న బోటు మునిగి 20మంది మరణించారు. వారం రోజుల్లో ఇది రెండో ఘటన అని చెప్పారు. ఇటీవలి కాలంలో లిబియా నుంచి ఈ తరహా ప్రయత్నాలు పెరిగాయి. ఈ ఏడది మొదటి ఆరు మాసాల్లో 7వేల మందికి పైగా సముద్రంలో అడ్డగించి వారిని బలవంతంగా లిబియాలోని నిర్బంధ శిబిరాలకు తరలించారు.