Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా: పారిస్‌లోని క్యూబా ఎంబసీ కార్యాలయంపై మంగళవారం ఉదయం బాంబు దాడి జరిగింది. కాగా, తమ దేశంపై హింసను ప్రోత్సహిస్తున్నారంటూ క్యూబా విదేశాంగ మంత్రి విమర్శించారు. ఎంబసీ కార్యాలయంపై ఇద్దరు దుండగులు మూడు మోల్తోవ్ కాక్టెయిల్ బాంబులను విసిరారని, దీనివల్ల భవనం కొంత మేర దెబ్బతిందని క్యూబా దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో దౌత్యాధికారులెవరూ గాయపడలేదు. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రొడ్రిగజ్ దీన్ని తీవ్రవాద దాడిగా పేర్కొంటూ ఇందుకు అమెరికానే కారణమని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఈ నెల్లో క్యూబాలో జరిగిన నిరసన ప్రదర్శనలకు అమెరికా మద్దతిచ్చింది. పైగా నిరసన కార్యకర్తలపై అణచివేత చర్యలు తీసుకున్నారంటూ కొత్తగా ఆంక్షలు కూడా విధించింది. స్వేచ్ఛ కోరుతున్న క్యూబన్లకు మేం బాసటగా నిలబడతామనిన ఈ నెల 12న బైడెన్ ఒక ప్రకటన చేశారు.
రష్యా నుంచి మానవతా సాయం
రష్యా నుంచి మానవతా సాయాన్ని క్యూబా అందుకుంది. ఆహార పదార్ధాలు, కోవిడ్ రక్షణ పరికరాలతో కూడిన రష్యా విమానం ఆదివారం రాత్రి హవానా చేరుకుంది. అత్యంత నాణ్యమైన 88.8టన్నుల గోధుమ పిండి, పది లక్షలల మాస్క్‌లు, కేన్డ్ ఫుడ్, సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి వాటిని తీసుకుని అందచేసినట్లు క్యూబాలోని రష్యన్ ఎంబసీ అధికారులు తెలిపారు. రష్యా అందించిన సాయానికి క్యూబా ప్రభుత్వం, ప్రజలు, పార్టీ తరపున క్యూబా వాణిజ్య మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.