Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ వృద్ధిరేటు అంచనాలను కుదించిన ఐఎంఎఫ్
వాషింగ్టన్ : భారత్ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంగళవారం కుదించింది. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే వేగాన్ని తగ్గించింది. దీంతో 2022 మార్చి 3తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటును 9.5శాతానికి కుదించింది. సెకండ్ వేవ్ రావడానికి ముందుగా ఏప్రిల్లో 2021-22 సంవత్సరానికి ఆర్థిక వృద్ధిరేటు 12.5శాతం వుండగలదని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2022-23 సంవత్సరానికి, వృద్ధిరేటు 8.5శాతమే వుండగలదని అంచనా వేశారు. ఏప్రిల్లో వేసిన 6.9శాతం అంచనాల కన్నా ఇది ఎక్కువ. మార్చి-మే మాసాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా రావడం వల్ల భారత్లో వృద్ది అవకాశాలు బాగా క్షీణించాయి, ఈ దెబ్బ నుండి కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని ఐఎంఎఫ్ తన తాజా ప్రపంచ ఆర్థిక దృక్పథం (డబ్ల్యుఇఓ)లో పేర్కొంది. గతేడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా (7.3శాతం) కుంచించుకుపోయింది. గత నెల్లో ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ కూడా భారత్ జిడిపి వృద్ధిరేటును 9.5శాతం వుండగలదని అంచనా వేసింది.