Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య గత వారంలో 21 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. గత వారం సంభవించిన 69 వేల మరణాల్లో ఎక్కువ శాతం అమెరికా,ఆగేయాసియా దేశాల్లో సంభవించాయి. అలాగే ప్రపంచవ్యాప్త ంగా కోవిడ్ కేసులు కూడా 8శాతం పెరిగాయని, మొత్తంగా దాదాపు 19.4 కోట్ల కేసులకు చేరాయని తెలిపింది. ఇదే ధోరణి కొనసాగితే, మరో రెండు వారాల్లో కేసుల సంఖ్య 20 కోట్లు దాటుతాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. యూరప్ మినహా అన్ని ప్రాంతాల్లో కోవిడ్ మరణాల సంఖ్య పెరిగిందని పేర్కొంది. అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, బ్రిటన్, భారత్‌ల్లో అధిక కేసులు నమోదయ్యాయని తెలిపింది.