Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్విటో : ప్రస్తుతం బ్రిటిష్ జైల్లో వున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జ్యూలియస్ అసాంజె పౌరసత్వాన్ని ఈక్వెడార్ రద్దు చేసింది. ఈక్వెడార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై ప్రతిస్పందిస్తూ ఈక్వెడార్ కోర్టు ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించింది. దేశ పౌరుడిగా విదేశీయుడిని అంగీకరించడాన్ని (నేచురలైజేషన్) రద్దు చేసిన విషయాన్ని తెలియచేసింది.సంబంధిత వాస్తవాలను, తప్పుడు పత్రాలను లేదా అవినీతిని దాచివుంచితే వాటి ప్రాతిపదికన మంజూరు చేసిన నేచురలై జేషన్ దెబ్బతిన్నట్లుగా పరిగణిస్తారు. ఇక్కడ అసాంజె నేచురలైజేషన్ లేఖలో పలు లొసుగులు, లోపాలు, భిన్నమైన సంతకాలు వున్నాయని ఈక్వెడార్ అధికారులు తెలిపారు. బహుశా పత్రాలను అక్రమంగా మార్చడం, ఫీజులు చెల్లించకపోవడం వంటి అనేక అవకతవకలు జరిగి నట్టు తెలుస్తోంది. అయితే సరైన విచారణేది జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని అసాంజె తరపు న్యాయవాది కార్లోస్ విమర్శించారు. ఈ కేసులో అసాంజె కోర్టుకు కూడా హాజరు కాలేదని అన్నారు. అందులో పేర్కొన్న తేదీనాటికి ఆయన స్వేచ్ఛ కోల్పోయారనీ, పైగా అనారోగ్యంతో వున్నారని కార్లోస్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై వివరణను కోరుతూ పిటిషన్ వేస్తానని ఆయన చెప్పారు. ఇక్కడ పౌరసత్వం కన్నా హక్కులను గౌరవించడమనే ముఖ్యమైన అంశం ఇమిడివుందని అన్నారు.