Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిమా: 2021 జులై 28న అంటే పెరూకు పర్వదినం ఇదే రోజు కొత్త అధ్యక్షుడిగా వామపక్షవాది క్యాస్టిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.పెరూ స్వాతంత్రం దినంకి ద్విశతాద్బి. ప్రమాణం చేసి కొత్త మంత్రులను ఆయన ప్రకటించి, పరిచయం చేస్తారు. దానితో పాటు ఆయన విజన్‌ని కూడా ప్రకటిస్తారు. కొత్త రాజ్యాంగం రూపొందించే అంశంతో పాటు పలు ప్రతిపాదనలు చేయనున్నారు. దక్షిన అమెరికా చరిత్రలో ఒక ఉపాధ్యాయుడు దేశ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. కొత్త రాజ్యాంగం రూపొందిస్తారనే అంశం ప్రచారం కావడ ంతో నయా ఉదాయవాదులు, కురుడు కట్టిన రాజకీయ నాయకులు ఇప్పటికే తమ వ్యతిరేకతను తెలియచూస్తున్నారు. ప్రజలు మాత్రం ఆనందోత్సహాలు జరుపుకుంటున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి అర్జెంటీనా, బొలివియా, చిలీ, కొలంబియా, ఈక్విడార్ అధ్యక్షులు మరి కొన్ని దేశాల మంత్రలు, విదేశీ రాయబారులు హాజరు కానున్నారు.