Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా: క్యూబాకు మెక్సికో తన సహాయకంగా ఆహార పదార్థాలు, ప్రాణాలు కాపాడే అత్యవసర మందులు, డీజిల్ మంటి ఇతర సరుకులను పంపుతున్నది. క్యూబాను అమెరికా ఆర్థిక దిగ్భంధనం చేయడంతో అన్ని రకాల కొరతలను ఎదుర్కొంటోంది. మెక్సికో మూడు ఓడలలో సహాయ సామగ్రీని పంపడాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఒక ఓడ క్యూబా చేరుకుంది.అందులో 10 కోట్ల బ్యారెళ్ల డీజిల్‌ను పంపారు. దీనిని అక్కడి ఆస్పత్రుల్లో విద్యుత్ కొరతను నివారించడానికి వినియోగించనున్నారు. రెండో ఓడ మంగళవారం నాడు బయలుదేరింది. మూడవ ఓడలో సిరం జీలు, ఆక్సిజన్ ట్యాంకులు, పాల పొడి, గోధుమ పిండి, బీన్స్, వంట నూనెలు, సహా పలు మందులు పంపిస్తున్నారు. అమెరికాలోని క్యూబా సంఘీభావ సంస్థలు, అమెరికాలో స్థిరపడ్డ క్యూబన్లు దేశవ్యాప్తంగా సహా య నిధి సేకరణకు పూనుకున్నారు. అమెరికా గడ్డమీదనే సంఘీభావం పెరగడంతో ఇతర దేశాలలో కూడా దీనిని ఆదర్శంగా తీసుకుని క్యూబాకు సహాయం అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా, ఇప్పటికే రష్యా నుంచి 88.8 టన్నుల నాణ్యమైన గోధుమ పిండి, 10 లక్షల మాస్కులు, వంట నూనెలు క్యూబాకు చేరుకున్నాయి.