Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వచ్చే అవకాశం ఉన్నదని అమెరికాలో అంటువ్యాధుల నివారణా సంస్థ సీడీసీ తెలియజేసంది. అమెరికాలో మాస్క్లు ధరించడంపై నిబంధనలు సరళీకరించిన నేపథ్యంలో మళ్ళీ మాస్క్లు దరించాలని ఒత్తిడి పెరుగుతున్నది. డెల్టా వేరియంట్ సాధారణ అంటు వ్యాధుల లాగానే చాలా త్వరగా సోకుతుందని సీడిసీ ప్రకటించింది. ఈ పరిస్థితి నిన్నటి పరిస్థితికి పూర్తి భిన్నం అని తెలుస్తున్నది. యుద్ధ లక్షణం మారిందని గమనించాల్సి ఉన్నది. ఒకటి రెండు రోజులలో పూర్తి వివరాలు, నివారణా చర్యల గురించి తెలియజేస్తామని సీడీసీ ప్రకటించింది.