Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: ప్రపంచంలోని 14 వేల మంది శాస్త్రవేత్తలు పర్యావరణ మార్పుల వలన ఏర్పడే ప్రమాదం గురించి ఒక లేఖ ద్వారా ప్రపంచ పౌరులను హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకు తక్షణం పూనుకోకపోతే కనీవినీ ఎరుగని కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు జులై 28న ఆ లేఖను విడుదల చేశారు.అందులో కార్బన్ను పీల్చుకునే అడవులు రానున్న రోజులలో కార్బన్ను విడుదల చేసేవిగా మారుతాయని, చెట్లు నరికివేయడం కారు చిచ్చు లాంటివి ప్రధాన కారణం అని అంటున్నారు. వాతావరణ ఇప్పుడు 422 పీపీఎంల వద్దకు చేరిందని ఇది కూడా పెరుగుతున్నదని 450 పీపీయంలు దాటిలే జీవరాసుల మనుగడ సాగించడం చాలా కష్టం అని అంటున్నారు. మంచు పలకల మందం రోజు రోజుకు తగ్గిపోతున్నదని దానితో ఏర్పడే నీటి ప్రవాహంతో సముద్ర మట్టం పెరిగి సముద్రతీర ప్రాంత నగరాలలో చాలా బాగం ముంపుకు గురి అయ్యే అవకాశం ఉన్నదని కూడా హెచ్చరించారు. మన భూగోళాన్ని కాపాడుకోవడానికి తక్షణం చర్యలు చేపట్టాలని ఇక సమయం లేదని హెచ్చరించారు.