Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : ఒకపక్క టోక్యోలో విశ్వక్రీడలు కొనసాగుతుండగా మరో పక్క వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం పట్ల జపాన్ అధికారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 24గంటల్లో టోక్యోలో 3865 కేసులు నమోదయ్యాయి. బుధవారం ఈ సంఖ్య 3,177గా వుండగా, వారం రోజుల క్రితంతో పోలిస్తే రెట్టింపుగా వున్నాయి. ఈ స్థాయిలో ఇంతవరకెన్నడూ కేసులు పెరగలేదని చీఫ్ కేబినెట్ కార్యదర్శి కాటో విలేకర్లతో అన్నారు. కొత్త కేసులు కేవలం టోక్యోలోనే కాకుండా, దేశమంతా పెరుగుతున్నాయన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే జపాన్లో ఇప్పటివరకు కోవిడ్ కేసులు, మరణాలు తక్కువగానే వున్నాయి. కానీ, గత వారం రోజులు నుండి చూసినట్లైలతే మాత్రం బాగా పెరుగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 28కి కోవిడ్ సోకుతోందని, టోక్యోలో ప్రతి లక్షమందిలో 88మందికి ఈ వైరస్ బయటపడుతోంది. ఈ సంఖ్య అమరికాలో 18.5గా, బ్రిటన్లో 48గా వుండగా, భారత్లో 2.8గా వుందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ డేటా తెలియచేసింది. ఈ సంక్షోభ పరిస్థితి గురించి ముందుగానే ప్రజలను హెచ్చరించకపోతే ఆరోగ్య వ్యవస్థపై మొత్తంగా పెను భారం పడే ప్రమాదముందని ఆరోగ్య సలహాదారు హెచ్చరించారు.