Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూకీ ప్రభావం నుంచి బయటపడిన మయన్మార్ యువత
నెపిడా : ఇప్పటివరకు మయన్మార్‌లో పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఆంగ్ సాన్ సూకీ ప్రభావం నుండి బయటపడి యువత తమ స్వంతంగా ప్రజాస్వామ్యం కోసం పోరు సల్పాలని భావిస్తున్నారు. దీంతో మిలటరీ నిర్బంధంలో వున్న సూకీ యువత దూరమవుతున్నారు. మయన్మార్‌లో సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్ఞీ) ప్రభుత్వం పదవీచ్యుతి జరిగి ఆరు మాసాలు అవుతోంది. ఇప్పటివరకు సైన్యం పాల్పడిన అణచివేత చర్యల్లో వెయ్యి మందికి పైగా మరణించారు. గతంలో జుంటాను ధైర్యంగా ఎదిరించిన సూకీ అంటే ఇప్పటికీ స్థానికంగా ప్రజాభిమానం తరిగిపోలేదు. అయితే, సైనిక జనరల్స్‌తో అధికార పంపిణీ ఒప్పందం కుదుర్చుకుని ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు కాస్త దెబ్బ తిన్నాయి. కానీ, దశాబ్దాల క్రితం నోబెల్ బహుమతి గ్రహీత సూకీ జరిపిన ఉద్యమం కంటే ముందుకి ఈనాటి పోరాటం సాగాలని చాలా మంది భావిస్తున్నారు. దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ నుండి సైనిక ఆధిపత్యాన్ని సమూలంగా నిర్మూలించాలని యువత బలంగా కోరుకుంటున్నారు. వచ్చే తరమైనా తమలా సైనిక నీడలో బతకకూడదని తాము గట్టిగా కోరుకుంటున్నామని 33ఏండ్ల డాక్టర్ మీడియాతో వ్యాఖ్యానించారు. హాంకాంగ్, థాయిలాండ్ వంటి దేశాల్లో యువత మాదిరిగా మయన్మార్‌లో యవత కూడా సామాజిక మాధ్యమాల్లో ఫ్లాష్ మాబ్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మూడు వేళ్ళను చూపిస్తూ, ప్రజాస్వామ్య అనుకూల శాల్యూట్లను అనుసరిస్తున్నారు. మయన్మార్‌లో ఇప్పటికీ సూకీని చారిత్రక ముఖ్యురాలిగా కన్నా మిన్నగానే గౌరవిస్తున్నారని మానవ హక్కుల పర్యవేక్షణా సంస్థలోని రీసెర్చర్ ఒకరు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం కోసం జరిపే పోరులో ఇకపై నేతల అవసరం లేదని సూకీ వ్యాఖ్యానించారు. అధికారం కోసం మరింత వికేంద్రీకృతమైన వైఖరిని అనుసరించాలనుకుంటున్నారని అన్నారు. విభిన్న రాజకీయ శక్తుల ఆవిర్భావాన్ని చూడాలనుకుంటున్నారని సూకీ వ్యాఖ్యానించారు. కొంతమంది అయితే సూకీ కీలక సిద్ధాంతమైన అహింసను కూడా విడిచిపెడుతున్నారు. వందలాదిమంది రెబెల్ గ్రూపుల నుంచి శిక్షణ తీసుకుని తిరిగి వచ్చి మిలటరీతో పోరాడేందుకు గానూ అడవుల్లోకి కూడా వెళుతున్నారని తెలుస్తోంది.