Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : భారత్, రష్యా నావికాదళాలు బాల్టిక్ సముద్రంలో రెండేండ్లకోసారి నిర్వహించే ఇంద్ర నేవీ విన్యాసాలు ముగించాయి. సైనిక విన్యాసాలుల ఆగస్టు 1 నుంచి 13 వరకు వోల్గోగ్రాడ్లో నిర్వహించనున్నారు. ఏండ్ల తరబడి రెండు నావికాదళాలు నిర్మించుకున్న నిర్వహణా సామర్ధ్యాన్ని మరింత సంఘటితం చేసుకోవడం ఈ ఏడాది విన్యాసాల ప్రాథమిక లక్ష్యమని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. బహుముఖ సముద్ర కార్యకలాపాలకు అనుసరించే పద్ధతులను, అవగాహనను పెంపొందించడం కూడా లక్ష్యమని తెలిపింది. ఇంద్ర ఆర్మీ వెర్షన్ విన్యాసాలకు ఇరు దేశాల నుంచి 250మంది చొప్పున సైనికులు పాల్గొంటారు. ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు తీవ్రవాద నిరోధక చర్యలు చేపట్టడం వీటి లక్ష్యంగా వుంది. విన్యాసాల సందర్భంగా యాంత్రిక శక్తులను వినియోగించడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారని నేవీ అధికారి తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన నేవీ విన్యాసాల్లో వివిధ రకాలైన ఆపరేషన్లు నిర్వహించారు. విమానాల నుండి వచ్చే కాల్పులకు వ్యతిరేకంగా కాల్పులు, సముద్ర జలాల్లోనే సరుకులను తిరిగి నింపే కసరత్తులు, బోర్డింగ్ డ్రిల్స్ వంటి పలు కార్యక్రమాలు జరిగాయన్నారు. బాల్టిక్ సముద్రంలో ఈ నెల 28, 29 తేదీల్లో జరిగిన విన్యాసాల్లో లభారత నావికాదళం తరపున స్టెల్త్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ తాబర్ పాల్గొనగా, రష్యా నావికాదళం తరపున ఆర్ఎఫ్ఎస్ జిలోనీ డాల్, ఆర్ఎఫ్ఎస్ ఒడింత్సొవ్లు పాల్గొన్నాయి.