Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ మూలాల అన్వేషణకు చర్యలు తీసుకోండి : అమెరికాను కోరిన చైనా
బీజింగ్ : తొలినాళ్ళలో తలెత్తిన కోవిడ్ కేసుల డేటాను అమెరికా ప్రచురించాలని చైనా డిమాండ్ చేసింది. ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్, నార్త్ కరోలినా యూనివర్శిటీలపై దర్యాప్తు జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. వుహాన్‌లో జరిగిన ప్రపంచ సైనిక క్రీడలు (మిలటరీ వరల్డ్ గేమ్స్)కు హాజరైన, జబ్బుపడిన సైనికుల వివరాల డేటాను ప్రచురించాలని డిమాండ్ చేసింది. కోవిడ్ మూలాలు తెలుసుకోవాలని నిజాయితీగా భావిస్తే, ఈ నాలుగు విషయాల్లో అమెరికా పారదర్శకంగా వ్యవహరించాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ, కోవిడ్ పట్ల సముచితమైన రీతిలో ప్రతిస్పందించడంలో విఫలమైన బాధ్యతను ఎదుటివారిపై నెట్టివేసేందుకు, ఇతర దేశాలపై దుష్ప్రచారాన్ని కొనసాగించాలన్న రాజకీయ లక్ష్యాన్ని సాధించేందుకుఅమెరికా, కోవిడ్ మూలాలను రాజకీయం చేస్తోందని విమర్శించారు. కోవిడ్ మూలాల అన్వేషణను ఒక సాధనంగా మార్చుకుందని వ్యాఖ్యానించారు. సైన్స్, న్యాయం పట్ల ఎలాంటి గౌరవం చూపకుండా, అబద్దాలు చెప్పడం, అపఖ్యాతి పాల్జేయడం, బలవంతపు చర్యలు వంటి మార్గాలను అనుసరిస్తోందని విమర్శించారు. కోవిడ్‌పై అంతర్జాతీయంగా జరిగే పోరాటానికి సంబంధించిన అధ్యాయంలో కచ్చితంగా అమెరికా వైఖరి లేదా ప్రవర్తన అనేది నమోదు చేయాలని అన్నారు. ఇతరులపై దుష్ప్రచారాన్ని సాగించడం ద్వారా మిమ్మల్ని మీరు కప్పిపుచ్చుకోలేరని ఝావో వ్యాఖ్యానించారు. అమెరికా నిజాయితీగా కరోనా మూలాలు ఎక్కడ నుండి వచ్చాయో తెలుసుకోవాలంటే ముందుగా తాము పేర్కొన్న నాలుగు అంశాలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. 2019 జులైలో ఉత్తర వర్జినియాలో శ్వాసకోశ సంబంధమైన వ్యాధి తలెత్తినట్లు వార్తలు వచ్చాయని ఝావో తెలిపారు. ఆ తర్వాత విస్కాన్సిన్లో కూడా ఈ కేసులు వచ్చాయన్నారు. 2019 సెప్టెంబరులో మేరీల్యాండ్‌లో ఈ కేసులు రెట్టింపయ్యాయని అన్నారు. ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్ వున్నది మేరీల్యాండ్‌లోనే.