Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ క్లయింట్లపై ఇజ్రాయిల్ ఎన్ఎస్ఓ : యూఎస్ మీడియా నివేదిక
వాషింగ్టన్ : పెగాసస్ స్నూపింగ్ కుంభకోణానికి కేంద్రంగా ఉన్న ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూపుతమ స్పైవేర్ ఉపయోగించకుండాప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ క్లయింట్లను తాత్కాలి కంగా బ్లాక్ చేసింది. స్పైవేర్ దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో సదరు ఎన్ఎస్ఓ ఈ చర్య తీసుకున్నది. యూఎస్ మీడియా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. భారతదేశంతో సహా అనేక దేశాలలో జర్నలిస్టు లు,మానవ హక్కుల రక్షకులు, రాజకీయ నాయకులు, ఇతరు లపై నిఘా పెట్టడానికి పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారనే ఆరోపణ లు..గోప్య తకు సంబంధించిన సమస్యలపై ఆందోళన కలిగించాయి.ఈ అంశం భారత పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. '' కొంత మంది ఖాతాదారులపై విచారణ ఉన్నది. ఆ ఖాతాదా రులలో కొందరు తాత్కాలికంగా సస్పెండ్‌కు గురయ్యారు'' అని నేషనల్ పబ్లిక్ రేడియో (ఎన్పీఆర్).. ఇజ్రాయిల్ సంస్థ వెల్లడించినట్టు ఉటంకించింది.