Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ మతస్చేచ్ఛ రాయబారిగా రషాద్ హుస్సేన్ ఎంపిక
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జోరు బైడెన్ మరో భారతీయ అమెరికన్‌కు తన ప్రభుత్వంలో కీలక పదవిని కట్టబెట్టారు. 'అంతర్జాతీయ మతస్వేచ్ఛ' రాయబారిగా భారతీయ అమెరికన్ రషాద్ హుస్సేన్‌ను అధ్యక్షుడు జోరు బైడెన్ నామినేట్ చేశారు. రాయబారిగా ఈ స్థానంలో ఒక ముస్లిం వ్యక్తిని నియమించటం ఇదే మొదటిసారి. రషాద్ హుస్సేన్(41) ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో గ్లోబల్ ఎంగేజ్మేంట్స్ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నియామకానికి సంబంధించి అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం మీడియాకు విడుదల చేసిన ప్రకటన ఈ విధంగా ఉంది.''అన్ని మతాల ప్రజల విశ్వాసాల్ని ప్రతిబింబించే ఒక పాలనా యంత్రాంగాన్ని అమెరికాలో చూడొచ్చు. అధ్యక్షుడు జోయి బైడెన్ నిబద్ధతకు తాజా నిర్ణయం ఒక ఉదాహరణ'' అని శ్వేతసౌధం తెలిపింది. నేషనల్ సెక్యూరిటీ డివిజన్లో న్యాయ విభాగానికి సీనియర్ కౌన్సిల్‌గా గతంలో రషాద్ హుస్సేన్ పనిచేశారు. అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ), కౌంటర్ టెర్రరిజంలో అమెరికా ప్రత్యేక దూతగా, శ్వేతసౌధం కౌన్సిల్లో డిప్యూటీ అసోసియేట్‌గా పనిచేశారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయాన జ్యూడీషియల్ లా క్లర్క్‌గా ఉన్నారు.