Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా: బంగ్లాదేశ్‌లో సంభవించిన వరదల్లో, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 20మంది మరణించారు. వీరిలో ఆరుగురు రోహింగ్యా శరణార్దులు వున్నారని అధికారులు తెలిపారు. ఆగేయ బంగ్లాదేశ్‌లోని గ్రామాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 3లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారని తెలిపారు. బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దు పొడవునా గల ఈ ప్రాంతంలో దాదాపు పది లక్షల మంది రోహింగ్యాలు శిబిరాల్లో వున్నారు. సోమవారం నుండి కురుస్తున్న కుండపోత వర్షాలకు ఈ శిబిరాలన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో వారంతా నిరాశ్రయులయ్యారు. కాక్స్ బజార్ జిల్లాలో వరదల్లో 3,06,000మంది చిక్కుకుపోయారు. దాదాపు 70 గ్రామాలు జల దిగ్బంధంలో వున్నాయని జిల్లా అడ్మినిస్ట్రేటర్ మున్నూర్ రషీద్ మీడియాకు తెలిపారు. చాలా ఇండ్లు నీట మునిగి వున్నాయి.