Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకుంటే ఇన్నాళ్ల కృషి వృథా : డబ్ల్యూహెచ్ఓ
జెనీవా : డెల్టా వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఇన్నాళ్లు చేసిన కృషి అంతా వృథా అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. చికెన్‌పాక్స్ (ఆటలమ్మ) అంత వేగంగా ఈ డెల్టా వేరియంట్ వ్యాపిస్తుందని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సిడిసి) పేర్కొన్న విషయాన్ని అది గుర్తు చేసింది. వేగంగా విస్తరించే ఈ వేరియంట్ ఇప్పటికే 132 దేశాలకు పాకిందని తెలిపింది. వైరస్ రూపాంతరం చెందుతూ వేగంగా విసర్తరిస్తున్నదని, ఇటువంటి సమయంలో మనందరం సమర్ధవంతమైన కార్యాచరణ ద్వారా దీన్ని ఎదుర్కోవాల్సి వుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైఖేల్ రియాన్ పత్రికా సమావేశంలో తెలిపారు. ఇప్పటివరకు ఆందోళన కలిగించే వేరియంట్లు నాలుగే వున్నాయని, డెల్టా వైరస్ ఇలాగే వ్యాపిస్తూ వుంటే భవిష్యత్తులో మరిన్ని వేరియంట్లు తలెత్తే ప్రమాదముందని డబ్ల్యుహెచ్ఓ చీఫ్ టెద్రోస్ అథనామ్ తెలిపారు. ఆరు రీజియన్లకు గాను ఐదింటిలో గత నాలుగు వారాల్లో సగటున 80శాతానికి పైగా కేసులు పెరిగాయన్నారు. డెల్టా చాలా దేశాలను వణికించినా ఇప్పటివరకు తీసుకున్న చర్యల వల్ల పెద్ద ఎత్తున వ్యాప్తి చెందకుండా కట్టడి చేయగలిగామని రియాన్ తెలిపారు. సంపూర్ణ వ్యాక్సినేషన్ వల్ల మరికొంత ఫలితం వుంటుందన్నారు. ఇప్పటివరకు ఆఫ్రికాలో కేవలం 1.5శాతం మంది జనాభాకే వ్యాక్సిన్లు అందాయని, గత నాలుగు వారాల్లో మరణాలు మాత్రం 80శాతం పెరిగాయని డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. ప్రస్తుతానికి డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై సమర్ధవంతంగానే పనిచేస్తున్నాయని మైక్ రియాన్ చెప్పారు.
మరో 41 వేలకు పైగా కేసులు.. 593 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో 41,469 కరోనా కొత్త కేసులు వెలుగు చూడగా, 593 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 3.16 లక్షలకు చేరువైంది. 4,23,810 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,08,920 క్రియాశీల కేసులు ఉన్నాయి. మొత్తం 46 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది.