Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్వాటెమాలలో ఆందోళనలు
గ్వాటెమాల : మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలలో ఆందోళనకారులు మళ్లీ రోడ్డెక్కారు. అవినీతి, కరోనా కట్టడిలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు అలెజాండ్రో గియామట్టేరు, ఆయన మంత్రిమండలి సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ప్రజామంత్రిత్వశాఖ మంత్రితో పాటు అటార్నీ జనరల్ కాన్సులో పోర్రాస్ కూడా తక్షణం రాజీనామా చేయాలని ఆందోళనకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మంత్రిత్వశాఖకు చెందిన స్పెషల్ ప్రాసిక్యూటర్ అగైనెస్టు ఇంప్యూనిటీ హెడ్ జువాన్ ఫ్రాన్సిస్కో సందోవల్ను తొలగించడం వలన అవినీతి తిరిగి పెచ్చరిల్లే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీస్థాయిలో ఈ ఆందోళనలు జరిగాయని స్థానిక మీడియా సంస్థలు నివేదించాయి.