Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: కోవిడ్ వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండడం, ఇల్లు ఖాళీచేయించడంపై నిషేధం తొలగిపోవడంతో లక్షలాది మంది అమెరికన్లు నిరాశ్రయులుగా మారనున్నారు. వీరి కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధులు మురిగిపోయాయి. డెల్టా వేరియంట్ ఒక వైపు విజృంభిస్తుండగా మరో వైపు ఇండ్ల ఖాళీ ప్రక్రియ జోరందుకుంటోంది. ఇంకోవైపు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇండ్ల అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. సగటు అమెరికన్‌కు నివాసం ఒక పెద్ద సమస్యగా మారుతున్నది. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన రూలింగ్ దృష్ట్యా ఇండ్లను ఖాళీ చేయించడంపై అమల్లో వున్న 11 మాసాల నిషేధాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని అధ్యక్షుడు జో బైడెన్ అమెరికన్ కాంగ్రెస్‌ను కోరారు. ఈ నిషేధం పొడిగింపునకు డెమొక్రాట్లు సుముఖంగా ఉన్నా, రిపబ్లికన్లు దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అద్దెలు భరించలేని వారికి ప్రభుత్వం కేటాయించిన నిధుల నుంచి సాయం అందించాలని అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ స్పీకరర్ నాన్సీ పెలోసి అధికారులకు సూచించారు.