Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కౌలాలంపూర్: మలేషియాలో ప్రతిపక్ష సభ్యులు సోమవారం నాడు పార్లమెంట్ భవన్కు నిరసన ప్రదర్శనకు దిగారు. దాదాపు 100 మంది పార్లమెంట్ సభ్యులు మిర్డెకా కూడలి నుంచి తమ నిరసన ప్రారంభించారు. మాజీ ప్రధాని మహతీర్ ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు అన్వర్ ప్రదర్శన అగ్రభాగంలో నడిచారు. ప్రస్తుత ప్రధాని ముహైయదిన్ కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైనారనీ, అందుకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. 100 మంది పార్లమెంట్ సభ్యులను కట్టడి చేయడానికి పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీసులను దించారు. నీటి ఫిరంగులను సిద్ధం చేశారు. దానితో ప్రతిపక్షాలు తమ వాణి వినిపించకుండా తమ ప్రభుత్వం నోర్లు నొకేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని రాజీనామా చేయాలనీ, కోవిడ్-19 నియంత్రణకు తక్షణ ప్రాధాన్యత ఇచ్చి అన్ని ఏర్పాట్లూ చేయాలని కోరారు. మలేషియాలో కోవిడ్ కేసులు 10 లక్షలు దాటాయి. మరణాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. నిన్న ఆదివారం 160 మంది చనిపోయారు. దానితో ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు.