Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబుజా: జీతాల పెంపు, ఇతర సౌకర్యాల కల్పన డిమాండ్ చేస్తూ నైజీరియాలో ప్రభుత్వ రెసిడెంట్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం.. రావాల్సిన బకాయిలు, ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నందుకు ఒప్పుకున్న ప్రత్యేక అలవెన్స్, ఇన్సూరెన్స్ సౌకర్యం తక్షణమే అమలు జరపాలని డాక్టర్లు కోరుతున్నారు. ఇవే సమస్యలపై గత ఏప్రిల్లో 10 రోజులపాటు వైద్యులు సమ్మె చేశారు. కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలిగించ వద్దనే ఉద్దేశంతో విరమించుకున్నారు. కాని ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా మారి కుటుంబాల పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో నిరవధిక సమ్మెకు పూనుకున్నట్టు యూనియన్ నాయకులు ప్రకటిం చారు.నైజీరియాలో మొత్తం 42,000 మంది డాక్టరు పనిచేస్తున్నారు. అందులో 16,000 మంది రెసిడెంట్ డాక్టర్లు. వీరు ఇప్పుడు సమ్మెలో ఉన్నారు. కాగా, మొత్తం వైద్యుల్లో 19 మంది కోవిడ్-19 విధుల్లో వుండగా మరణించారు. వారి కుటుంబసభ్యులకు ఇన్సూరెన్స్ నగదు ఇంతవరకూ అందలేదు. ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలతోనే డాక్టర్లు అన్నింటికి తట్టుకుని ప్రజలకు వైద్యం అందిస్తున్నా ప్రభుత్వం సరైన పద్ధతిలో స్పందించటంలేదు. నైజీరియాలో ఇప్పటివరకూ 1,74,315 వైరస్ కేసులు నమోదుకాగా... అందులో 2,140 మంది చనిపోయారు.