Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చైనాలో ప్రధానంగా పంది మాంసం ఎక్కువ వాడుతారు అందుకని వాటికి వైరస్లు సోకకుండా అన్ని రకాల ఆధునిక పద్ధతులలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దక్షణి చైనాలో 13 అంతస్తుల భవనంలో 10 వేల పందులను ఉంచారు. వాటికి భవనంలోనే పశువైద్యశాల, పూర్తి ఎయిర్కండిషన్ వ్యవస్థ, అన్నీ జాగ్రత్తలు తీసుకుని తయారు చేసిన భోజనం మాత్రమే పెట్టుతారు. ఇలాంటి సంరక్షణ కేంద్రాలు చైనాలో చాలా ఉన్నాయి.పందులకు ఆఫ్రికన్ స్వేన్ జ్వరం వస్తే వేల పందులు చనిపోతుంటాయి. దానితో మాంసం కొరత ఏర్పడుతుంది. అందుకని ముందు జాగ్రత్త చర్యగా ఈ సంరక్షణ కేంద్రాలు విరివిగా నిర్వహిస్తున్నారు. 2017లో వైరస్ సోకి చాలా పందులు చనిపోవడంతో చైనా ప్రభుత్వం జాగ్రత్తలు పాటిస్తున్నది. చైనాలో పోషక ఆహారం కోసం పందులకు ఇస్తున్న ప్రాధాన్యత మన దేశంలో మనుషుల ప్రాణాల రక్షణకు ఇవ్వడం లేదు.