Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు మృతి
సిడ్నీ : ఆస్ట్రేలియాలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రమైన సిడ్నీ తాజాగా కరోనా కేసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. స్థానికంగా డెల్టా వేరియంట్‌కు సంబంధించి 262 కొత్త కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారని అధికారులు తెలిపారు. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రధాని గ్లాడేస్ బెరెజిక్లియాన్ గురువారం మాట్లాడుతూ, మరణించిన వారిలో నలుగురు వ్యాక్సిన్లు వేయించుకోలేదని చెప్పారు. ఒకరు మే చివరిలో ఆస్ట్రాజెనికా సింగిల్ డోసు వేయించుకున్నారని తెలిపారు. రెండో డోసు కోసం గరిష్టంగా 12 వారాలు వేచి వుండవద్దని అధికారులు సిడ్నీ ప్రజలను కోరారు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రాజెనికా, ఫైజర్ వ్యాక్సిన్లు అందుబాటులో వున్నాయి. జూన్‌లో తాజాగా కరోనా ప్రబలిన తర్వాత సిడ్నీలో 21 కోవిడ్ మరణాలు సంభవించాయి. జూన్ 26 నుంచి సిడ్నీ, చుట్టుపక్కల ప్రాంతాలు లాక్డౌన్లో వున్నాయి. బుధవారం నాటికి మొత్తంగా 20శాతం యువత మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.