Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన భారత్ విదేశాంగ మంత్రి
టెహరాన్ : అమెరికా ఆంక్షలతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సంక్షోభం, అణు ఒప్పందంపై కీలకమైన చర్చల నేపథ్యంలో ఇరాన్ కొత్త అధ్యక్షుడు ఇబ్రహీం రైసి గురువారం పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇరాన్ మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేని ఆమోద ముద్ర లభించడంతో మంగళవారం నుండే రైసి పాలన ప్రారంభమైంది. మోడరేట్‌గా వుండే హసన్ రౌహని నుండి తీవ్ర కన్జర్వేటివ్ భావజాలం కలిగిన రైసి అధికార పగ్గాలు చేపట్టారు. మన శత్రువులు అనుసరించిన ఘర్షణాయుత వైఖరి, విధానాల వల్ల, దేఏశంలో సమస్యలు, లొసుగులు, లోపాల వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేవని రైసి వ్యాఖ్యానించారు. ఈ 'అణచివేత' ఆంక్షలను ఎత్తివేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామి ఇచ్చారు.
ప్రాధాన్యత సంతరించుకున్న జైశంకర్ పర్యటన
అమెరికా ఆంక్షల కారణంగా భారత్ చమురు దిగుమతులను రద్దు చేసుకోవడం, కాశ్మీర్‌పై ఇరాన్ వ్యాఖ్యలు వంటి పలు కారణాల వ ల్ల దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకునేందుకు ఇటీవల కాలంలో భారత్, ఇరాన్‌లు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే రైసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ఒకవైపు ఇరాన్‌తో సంబంధాలను కొనసాగిస్తునే మరోవైపు అమెరికాతో, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్‌తో సంబంధాలు నెరపాలని భారత్ భావిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే జైశంకర్ ఇరాన్లో పర్యటించడం ఇది రెండవసారి. రౌహని హయాంలో తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలని భారత్ భావిస్తోంది.
ఆఫ్ఘన్ పరిణామాలు ఆందోళనకరం
ఆఫ్ఘన్లో తాలిబన్ చాలా వేగంగా చొచ్చుకుపోవడం, హింసకు పాల్పడడం వంటి పరిణామాలు భారత్, ఇరాన్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ సామ్రాజ్యం ఏర్పడడం రెండు దేశాలకు భద్రతాపరమైన ముప్పు అని ఇరాన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.