Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: చైనాతో వాణిజ్య చర్చలు పునర్ ప్రారంభించాలని అమెరికా వ్యాపారస్తులు బైడెన్ను కోరారు. ట్రంప్ కాలంలో జరిగిన వాణిజ్య చర్చల ఫలితంగా అమెరికా చైనాతో సరుకుల వ్యాపారంపై ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధించడం వల్ల తాము నష్టపోతున్నట్టు బంగాళా దుంపలు పండించే రైతులు, మైక్రో చిఫ్లు తయారు చేసే కంపెనీలు, మందుల కంపెనీలు తెలుపుతున్నాయి. ఈ పరిస్థితిని సరి చేసేందుకు బైడెన్ ప్రభుత్వం చైనాతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.చైనా ప్రభుత్వం తమ దేశంలో తయారు అవుతున్న విద్యుత్ కార్లకు మైక్రో చిఫ్లకు రాయితీలు కల్పిస్తున్నది దానితో చైనా ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడి అమెరికా ఉత్పత్తులు నష్టపోతున్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న కోట్ల విలువ చేసే సరుకులు అమెరికాలో స్తంభించి పోయి కూడా నష్టం జరుగుతున్నది. ఇలాంటి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికాలోని పెద్ద వాణిజ్య సంస్థలు బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి.