Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లోని ఫర్హా పట్టణాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫర్హా ప్రాంతీయ రాజధాని గత ఐదు రోజుల్లో ఏడు ప్రాంతీయ రాజధానులను తాలిబన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. ఫర్హాలోని గవర్నర్ భవనాన్ని, కేంద్ర ఖారాగారాన్ని ఇతర ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నామని ప్రభుత్వ బలగాలు తెలిపాయి. ఇప్పటికే 310 మంది తాలిబాన్లను హతమార్చినట్టు తెలిపారు. అఫ్ఘాన్‌లో ప్రధాన పట్టణాలైన హీరత్, కాందహార్, తాలక్వాన్, లలషగర్ లాంటి పట్టణాలపై తాలిబాన్లు దాడులు ప్రారంభించారు. ఆ పట్టణాలలోని ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.