Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రెసిలియా: బ్రెజిల్‌లోని అమెజాన్ అడవులు ప్రపంచంలోనే పెద్దవి. అందులో దాదాపు తొమ్మిది లక్షల మంది ఆదివాసీ తెగలకు చెందిన వారు, 462 ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రాంతాల(రిజర్వుడ్ ఫారెస్ట్)ల్లో నివసిస్తున్నారు. ఇప్పుడు బోల్స్‌నారో ప్రభుత్వం వారిని అక్కడ నుంచి గెంటివేసి ఆ ప్రాంతాలను పెద్ద పెద్ద ఆయిల్, మైనింగ్ సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ అడవి అనేది పర్యావరణ సమతుల్యత సాధించడంలో చాలా కీలకమైంది. ప్రకృతిలోని కార్బన్‌ను అది పీల్చుకుంటుంది. అక్కడ మైనింగ్ చేయడానికి చెట్లు నరికి వేస్తే సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. ఆ అడవి అనేక రకాల చెట్లు, జంతువులకు ప్రత్యేకం. అవి కూడా అంతరించి పోయే ప్రమాదం ఉన్నది.