Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : పెరుగుతున్న చట్టపరమైన ఒత్తిళ్ళు, అమెరికా అధ్యక్షుడి నుండి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. 11మంది మహిళలను లైంగికంగా వేధించారని ఆయనపై జరిగిన విచారణలో వెల్లడైన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. దేశంలోనే అత్యంత జనాభా కలిగిన రాష్ట్ర గవర్నర్గా 2011 నుండి వున్న క్యుమో, దర్యాప్తు ఫలితాలు వెల్లడించిన వారానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు మాసాల పాటు సాగిన స్వతంత్ర విచారణ అనంతరం న్యూయార్క్ అటార్నీ జనరల్ లిటీషియా జేమ్స్ మాట్లాడుతూ ఆండూ అమెరికా ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించారని నిర్ధారించారు. టివిలో ప్రజలనుద్దేశించి క్యుమో మాట్లాడుతూ తన రాజీనామా 14రోజుల్లో అమల్లోకి వస్తుందన్నారు. ఈ చర్యతో ఆండ్రూ సుదీర్ఘమైన రాజకీయ జీవితం పట్టాలు తప్పింది. ఇప్పటికీ తానెలాంటి తప్పు చేయలేదనే ఆయన వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తాను పక్కకు తప్పుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అనుమతించడమే సరైన మార్గమని భావించానని అందుకే ఈ రాజీనామా నిర్ణయమని చెప్పారు.