Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ నిపుణుల హెచ్చరిక
లండన్ : అత్యంత వేగంగా సంక్రమించే సామర్ధ్యం కలిగిన డెల్టా వేరియంట్‌ను హెర్డ్ ఇమ్యూనిటీ నిలువరించజాలదని బ్రిటన్‌కి చెందిన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూపు హెచ్చరించింది. ఆక్స్ఫర్డ్ వర్శిటీ కోవిడ్ వ్యాక్సిన్ బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ ఆండ్రూ పొల్లార్డ్, కరోనా వైరస్‌పై ఏర్పాటైన అఖిల పక్ష పార్లమెంటరీ బృందం (ఎపిపిజి)తో మాట్లాడుతూ, చాలా వేగంగా విసర్తించే సంక్రమణ సామర్ధ్యం కలిగిన వేరియంట్ వ్యాప్తి చెందకుండా పూర్తిగా నిలువరించే అవకాశాలు కనిపించడం లేదన్నారు. అయితే, దీనిపై అంతగా భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ వైరస్ తట్టు (మీజిల్స్) లాంటిది కాదు, కానీ, తట్టు రాకుండా 95శాతం జనాభా వ్యాక్సిన్ వేయించుకున్నట్లైతే ఈ వైరస్ ప్రజల్లో విస్తరించకుండా చూడొచ్చని పొల్లార్డ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నా డెల్టా వేరియంట్ ఇంకా ప్రజలకు సోకుతోంది. అంటే వ్యాక్సిన్ వేయించుకోనివారికి ఏదో ఒక సమయంలో వైరస్ సోకుతుందని కాదు. సంక్రమణను నిలువరించగలమని మనం చెప్పలేం. అందుకని, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం కష్టమే, పైగా కొత్త వేరియంట్ తలెత్తే అవకాశాలు కూడా వున్నాయని అనుమానిస్తున్నట్లు పొల్లార్డ్ చెప్పారు. ఈస్ట్ అంగ్లియా వర్శిటీ ప్రొఫెసర్ పాల్హంటర్ కూడా ఈ విషయాన్ని బలరిచారు. ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు వైరస్‌పై సమర్ధవంతంగానే పనిచేస్తాయని, కానీ సమూలంగా ఇన్ఫెక్షన్లు నివారించలేవని అన్నారు.