Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : ఫోర్బ్స్ జాబితాలో భారత సంతతికి చెందిన ఐదుగురు మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ (స్వయం సంపాదన మహిళ ధనవంతులు) పేరుతో తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో ఇండో అమెరికన్లు అయినా అరిస్టా నెట్వర్క్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ 1.7బిలియన్ డాలర్ల ఆస్తులతో 16వ స్థానంలో నిలిచారు. సింటెల్ ఐటి కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథి ఒక్క బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో 26వ స్థానం దక్కించుకున్నారు. కాన్ఫ్లుయెంట్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు, మాజీ చీఫ్ టెక్నాలజీ అధికారి నేహా నారడే 925 మిలియన్ డాలర్ల సంపదతో 29వ స్థానంలో ఉన్నారు. జింగో బయోవర్క్స్ సహ వ్యవస్థాపకురాలు రేష్మా శెట్టి 750 మిలియన్ డాలర్ల ఆస్తులతో 39వ స్థానంలో, పెప్సికో సంస్థ సీఈఓ ఇంద్రా నూయి 290 మిలియన్ డాలర్ల ఆస్తులతో 91వ స్థానంలో నిలిచారు. ఈ ఐదుగురి సంపద 4.6 బిలియన్ డాలర్లుగా ఉంది.